గుక్కెడు నీటికోసం గుడ్లూరివారిపాలెం గ్రామస్తులు పడుతున్న కష్టాలు..

151

THE BULLET NEWS (VENKATACHALAM)-నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గుడ్లూరివారిపాలెం పంచాయతీ గుడివాడతోపు గ్రామంలో పది రోజులుగా నిలిచిపోయిన నీటి సరఫరా.. అలంకారంగా త్రాగునీటి ట్యాంకులు గ్రామస్తులులకు ఉప్పునీరే శరణ్యం…గ్రామంలో మౌలిక వసతులు కరువు…గ్రామం చుట్టూ రొయ్యల చెరువులు ఇది గుడివాడతోపు గ్రామస్తుల గోడు…

గుక్కెడు నీటికోసం గ్రామస్తులు పడుతున్న కష్టాలు.. పది రోజులుగా త్రాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారుల లో చలనం లేదు..సర్వేపల్లి సమ్మర్ స్టోరేజ్ మంచినీటి పథకం నుంచి పది రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తుల అవస్థులు అన్ని ఇన్ని కావు…

ప్రత్యామ్నాయంగా బోర్లు లేకపోవడంతో చెరువులు, లీకేజీ గుంటల దగ్గరకి వెళ్ళి తెచ్చుకుంటున్నారు… మరో ప్రత్యామ్నాయం లేకా గ్రామస్తులు వాటినే అవసరాలకు వినియోగిస్తున్నారు… కొందరు మాత్రం ప్రక గ్రామం నుండి వాళ్ళు సొంత నగదు తో వాటర్ ట్యాంక్ తో నీరు తెపించుకుంటున్నారు… అధికారులు వెంకటాచలం మండలంలో పర్యాటించే సమయంలో నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. వాళ్ళు రాకుంటే నీటి సరఫరా ఆగిపోతుంది. సర్వేపల్లి రిజర్వాయర్ సమ్మర్ స్టోరేజ్ దగ్గర సిబ్బందిని ఫోన్ ద్వారా అడిగితే మిషన్స్ ప్రాబ్లమ్ అని,పైపులు మరమ్మతులకు గురైంది అని చెపుతారు… గ్రామంలో మంచినీటి లీకేజీ గుంతలు లో మురికి నీరు కలుషితమవుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోరు… గత రెండు నెలలుగా వీధి లైట్ లు వెలగడం లేదు…ఇలా పంచాయతీ అధికారులు గ్రామస్తులు సమస్యలు పటించుకోకుండా వ్యవహరించడం ఎంత వరకు న్యాయం అన్ని గ్రామస్తులు అధికారుల పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకనైనా అధికారులు మొండి వైఖరి విడనాడి తమ సమస్యలను పరిష్కరిచాలని కోరుకుంటున్నారు..

SHARE