వెంకటగిరిలో మేమంతా ఒక్కటే.. మాలో గొడవలు పెట్టొద్దు – చేనేత నాయకులు వెల్లడి

140

The bullet news (  Venkatagiri)-  చేనేత కుటుంబానికి చెందిన మహిళా చైర్ పర్సన్ దొంతు శారదను చేనేత దినోత్సవం రోజున వెంకటగిరి ఎమ్మెల్యే అవమానపరిచారని వస్తున్న వార్తలు అవాస్తవాలని వెంకటగిరి చేనేత సంఘనాయకులు అన్నారు. ఆర్&బి అతిథి గృహంలో వారు మాట్లాడుతూ ఈ నెల జాతీయ చేనేత దినోత్సవం రోజున జరిగిన మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో… చైర్పర్సన్ కుర్చీని తొలగించిన విషయంలో ఎమ్మెల్యే పాత్ర ఉందంటూ వచ్చిన వార్తలను వారు ఖండించారు. జిల్లా కేంద్రంలో కొందరు చేనేత సంఘం నాయకులు ప్రెస్ మీట్ పెట్టడంపై వెంకటగిరి చేనేత సంఘాల నాయకులు, అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రెస్ మీట్ లు పెట్టే చేనేత సంఘాల నాయకులు ఎవరో తమకు తెలియదని, వెంకటగిరి చేనేత కుటుంభాల ఐక్యత మధ్య గొడవలు పెట్టొద్దని వారు
కోరారు.. 2015లో వరదల్లో తీవ్రంగా నష్టపోయిన చేనేత కుటుంబాలను ఎమ్మెల్యే
అన్నివిధాలుగా ఆదుకున్నారని ఆయనపై దుష్పచారం చేయడం సరికాదన్నారు..

SHARE