సోమిరెడ్డి అవినీతి గురించే మేం ముందే చెప్పాం – వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి

136

The bullet news (Nellore)- ముందస్తు ఎన్నికల మాట అటుంచితే నెల్లూరు జిల్లా రాజకీయాలు రంజుగా మారాయి.. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మంత్రి సోమిరెడ్డి వర్సెస్ కాకాణి గా మారింది. తన రాజకీయ ప్రత్యర్ది, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్దన్ రెడ్డి మరోసారి బాంబ్ పేల్చారు.. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలే సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారని.. అయనా సోమిరెడ్డికి బుద్ది రావడం లేదన్నారు.. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కాకాణి మంత్రి పై మరోసారి కత్తులు దూశారు.. సోమిరెడ్డి మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆయన అవినీతికి అంతే లేకుండా పోతోందని విమర్శించారు..గతంలో తాను ఆరోపించినట్లుగానే చిల్లకూరు, కోట మండలాల్లో 2 వేల 200 ఎకరాల సిలికా గనులను కొట్టేసేందుకు సోమిరెడ్డి రంగం సిద్ధం చేశారన్నారు.. బాధ్యతాయుతమైన మంత్రిగా వుంటూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు సోమిరెడ్డికి సిలికా గనులతో సంబంధం లేకపోతే వాటిని రద్దు చేయించాలని డిమాండ్ చేశారు.. నీరు-చెట్టు పేరుతో ఒకే పనికి మూడు బిల్లులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు..సోమిరెడ్డికి దమ్ముంటే తాము చేసిన ఆరోపణలపై విచారణ సిద్ద పడాలని ఆయన డిమాండ్ చేశారు.. స్వంతపార్టీ నేతలే సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నిస్తున్నారని వెంటనే ఆయన్ని మంత్రి పదవి నుంచి బర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు..

SHARE