‘అవిశ్వాస తీర్మానానికి వైఎస్‌ఆర్‌ సీపీ సిద్ధం’

81

The bullet news ( Kandukuru ) _

ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రకటించారు. ఆదివారం 91వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

‘తెలుగుదేశం పార్టీ పార్టనర్‌ పవన్‌ కళ్యాణ్‌ జాయింట్‌ ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీని ఏర్పాటు చేశాడు. కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీసుకుంది అనే అంశాలను తెలుసుకుంటారట. అయ్యా పవన్‌ కళ్యాణ్‌ గారూ.. 2014 నుంచి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రతీసారీ రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కేంద్రం ఏమీ ఇవ్వడం లేదంటూ ఆయన డ్రామాలు ఆడుతున్నారు. దీన్ని బట్టి తెలియడం లేదా? కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయా? లేదా? అని.

మీ కమిటీ పరిశోధన… కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లుగా ఉంది. ఎంతిచ్చారు.. ఎంత తీసుకున్నారన్న విషయం పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాలను రక్షించే ప్రత్యేక హోదాపై మీరు పోరాడాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అభివృద్ధికి కావాల్సిన నిధులు వాటంతట అవే వస్తాయి. హోదాతో సమానంగా ప్యాకేజి ఇస్తామని కేంద్ర అన్నదట.. సరే మరి అయితే అని దానికి చంద్రబాబు తలూపారట. హోదాకు ప్యాకేజికి నక్కకు నాకలోకానికి ఉన్న తేడా వుంది. హోదా వస్తే ఆదాయపు పన్ను, జీఎస్టీలను పెట్టుబడులు పెట్టే కంపెనీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మరి ప్యాకేజీలో అలాంటి నిబంధనలు ఉంటే చూపించండి.

ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పని చేయకుండా డ్రామా ఆర్టిస్టుగా మారాడు. గత 15 రోజులుగా ఎడతెగని డ్రామాను నడిపిస్తున్నాడు. ఒక్కసారి ఈ 15 రోజుల ఎల్లోమీడియా పేపర్లను తిరగేసినా, చానెళ్ల ప్రసారాలను తిలకించినా ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నాలుగేళ్లుగా ఏళ్లుగా చంద్రబాబు బీజేపీతో కలసి ఉన్నారు. టీడీపీ ఎంపీలను కేంద్రంలో మంత్రులుగా పెడతాడు. బడ్జెట్‌ ప్రకటించేప్పుడు మంత్రులకు కేటాయింపుల వివరాలు తెలుస్తాయి. అయినా వాటిని ప్రశ్నించకుండా.. అలానే ఆమోదింపజేశాడు.

SHARE