అకాలవర్షంతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటాం: మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

91

The bullet news (Nellore )- చేతికొచ్చిన పంట అకాల వర్షం కారణంగా రైతులు నష్టోయారని వారందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.. ఆత్మకూరు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాలలో ఆరబోసిన ధాన్యం తడిసిపోవడం, కోతకొచ్చిన పంట నేలకొరిగి ధాన్యం రాలిపోవడం, కొన్ని ప్రాంతాల్లో గిట్టుబాటు ధర కోసం నిల్వచేసిన ధాన్యం బస్తాలు వర్షానికి ముద్ద అవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.. ఈ విషయాన్ని వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి, మంత్రి నారాయణ ద్రుష్టికి తీసుకెళ్లానని వారందరికీ ప్రభుత్వ నుంచి సాయం అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.. తక్షణమే నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి సమగ్ర నివేదిక తయారు చేసేందుకు వ్యవసాయ, రెవెన్యూ అధికారులను సంబంధిత ప్రదేశాలకు పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు.. నష్ట వివరాలను సంబంధిత రైతులు నమోదు పరచుకోవాలని ఆయన విజ్ణప్తి చేశారు..

SHARE