బిసిల సత్తా ఏంటో చూపిద్దాం..

74

The Bullet News ( Nellore)_ రాష్ట్రంలో ఉన్న బీసీలను అందరిని ఒక తాటిమీదకు తీసుకొచ్చి వారి హక్కుల కోసం పోరాటం చేస్తున్న సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లిపాయల శంకరయ్య సేవలు ప్రశంసనియమని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ అన్నారు.. సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం నాల్గో వార్షికోత్సవ వేడుకలు నెల్లూరులోని కార్యాలయంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అనిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. తెలుగుదేశం ప్రభుత్వం బిసిలను ఓటు బ్యాంకు గా మాత్రమే చుస్తోందన్నారు.. వారిని విస్మరిస్తే టిడిపికి పుట్టగతులుండవని ఆయన హెచ్చరించారు.. సీమాంధ్ర బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరయ్య మాట్లాడుతూ చట్ట సభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు.. బిసిల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వారికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కరని మండిపడ్డారు.. బీసీలపై వివక్షత కొనసాగితే టిడిపి బుద్ది చెబుతామని ఆయన హెచ్చరించారు..

SHARE