కోవూరు షుగ‌ర్స్ కు పూర్వ వైభ‌వం తీసుకొస్తాం – మంత్రులు సోమిరెడ్డి, నారాయ‌ణ‌

71

The bullet news (Kovuru)_ కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామ‌ని వ్యవసాయశాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.. నెల్లూరుజిల్లా కోవూరు మండలం ఇనమడుగులో మంత్రి నారాయణతో కలిసి ఆయ‌న పర్యటించారు.. ఈ సందర్భంగా పడుగుపాడు సొసైటీ ఆధ్వర్యంలో ఇనమడుగులో నిర్మించిన గిడ్డుంగులను వారు ప్రారంభించారు.. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ కోవూరుకు షుగర్స్ విషయంలో రైతుల సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు.. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం కోసం కోల్డ్ చైన్ కార్పొరేషన్ ని అందుబాటులోకి తెస్తున్నామన్నారు.. రాష్ట్రంలో సహకార వ్యవస్థను పటిష్ట పరిచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదని పట్టణ పురపాలకశాఖామంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.. మూడేళ్ళలో 44 వేల కోట్లు నీటి పారుదల రంగానికి ఖర్చు పెట్టామన్నారు.. వ్యవసాయమంటే దండగ కాదు, పండగ అనే పరిస్థితి తీసుకొచ్చామన్నారు.. కోవూరు పట్టణాన్ని 6 నెలల్లో మున్సిపాలిటీగా మారుస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు..ఈ కార్య‌క్ర‌మంలో అధ్య‌క్షులు బీదా ర‌విచంద్ర‌, ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, నేత‌లు పాల్గొన్నారు.

SHARE