మీ అంద‌రి స‌హ‌కారంతోనే ఏ గ్రేడ్ వ‌చ్చింది – గూడూరు ఎమ్మెల్యే సునీల్

97

The bullet news (Gudur)- గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ అంద‌రి స‌హ‌కారంతోనే గూడూరు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఆదర్శ‌వంతంగా తీర్చిదిద్దుతున్నాన‌న్నారు. .నియోజకవర్గంలో ఈ ఏడాదిలోపు చేయాల్సిన పనులపై గ్రామాల వారీగా ప్రణాళిక ప్రకారం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈ క‌మిటీ తీర్మానం చేసింది.. ఈనెల 26 నుంచి నిర్వహించనున్న దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయ‌న క‌మిటీని కోరారు.. అనంత‌రం ముఖ్య‌మంత్రి చేసిన స‌ర్వేలో ఎమ్మెల్యేకి ఏ గ్రేడ్ రావ‌డంతో క‌మిటీ స‌భ్యులు భారీ ఘజమాలతో సత్కరించి కేక్ క‌ట్ చేశారు.. అనంత‌రం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ.11-లక్షల55 వేల చెక్కులను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు పంపిణీ చేశారు..

SHARE