నెల్లూరుజిల్లాలో ఏం జ‌రుగుతోంది..?

246

The bullet news (Nellore Hot Topic)- టిడిపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచిపోయాయి.. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాష్టానికి బాబు సీఎం అయ్యారు.. ఎన్నికల సమయంలో అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని హామీల వర్షం కురిపించారు చంద్రబాబు నాయుడు.. ఆ హామీల అమలుపై ఉద్యోగులు, రైతులు, సామాన్యులు ఏమనుకుంటున్నారు..? జిల్లాలో ప్రభుత్వం పై బాణాలు ఎక్కుపెడుతున్నదెవ్వరు..? నెల్లూరు జిల్లాలో వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇవాళ్టి హాట్ టాపిక్..

దీక్ష‌లు, ద‌ర్నాలు, నిర‌స‌న‌ల‌తో నెల్లూరుజిల్లా ద‌ద్ద‌రిల్లుతోంది.. ప్ర‌భుత్వం త‌మ‌ను మోసం చేసింద‌ని ఒక‌రంటే.. ఎన్నిక‌ల వేళ ఇచ్చిన హామీల‌ను వెంట‌నే అమ‌లు చేయాల‌ని మ‌రొక‌రు.. చంద్ర‌బాబు నాయుడు త‌మ‌ని మోసం చేశార‌ని ఇంకొక‌రు.. ఇలా జిల్లా వ్యాప్తంగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు, నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు.. ఎన్నికల మేనిపెస్టోలో చెప్పిన విధంగా తమను రెగ్యులర్ చేసి ధర్డ్ పార్టీతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగాజీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కార్మికులు చేపట్టిన రిలే దీక్షలు దాదాపు ఎనిమిది రోజులపాటు కొనసాగాయి.. భారీ ర్యాలీలు, కలెక్టరేట్ ఎదుట నిరసనలతోపాటు మానవహారాలు నిర్వహించి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు కరెంటోళ్లు.. వీరి నిరసన కార్యక్రమానికి నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు సంఘీబావం తెలిపి తాము అధికారంలొకివచ్చిన వెంటనే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు..

ముత్తుకూరు మండలం నేలటూరు ఏపీ జెన్ కో కార్మికులు చేపట్టిన దీక్షలు పదోరోజుకు చేరుకున్నాయి.. తమను రెగ్యులర్ చేసి వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ దాదాపు 500 మంది విధులు బహిష్కరించి టెంటేసుకూర్చున్నారు.. రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన మాత్రం కరువైంది.. తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం నెరవేర్చకపోతే ఆమరణదీక్షకు దిగుతామని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.. వీరి ధర్నాలకు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి మద్దతిచ్చారు.. జెన్ కో పోరాటాలు చేసే పోరాటాలకు తాను అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు..ఉద్యోగులు, నిరుద్యోగులతో పాటు రైతులు సైతం రోడ్డెక్కారు..

మద్దతు ధర కోరుతూ కోవూరులో రైతులు నిరాహార దీక్షలు ప్రారంభించారు.. రైతులను పట్టించుకోకుండా పాలన సాగించే ఏ ప్రభుత్వం బాగుపడలేదని రైతు సంఘ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.. రైతులను ప్రభుత్వం గుర్తించి మద్దతు ధర ప్రకటించాలని ప్రముఖ న్యాయవాది జక్కా శేషమ్మ డిమాండ్ చేశారు.. సారా ఉద్యమ తరహాలో రైతులు సైతం పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తే ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటూ ఆమె దుయ్యబట్టారు.. వీరికి ఆల్ ఇండియా ఐద్వా తరుపున న్యాయవాదులు మద్దతిచ్చారు..

వీరే కాకుండా అగ్రిగోల్డ్ బాధితులు, సీపీఎస్ ఉద్యోగులు, విఆర్ ఏలు, అంగన్వాడీలు, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు రోడ్డెక్కి
తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు..

SHARE