ఆ నియోజకవర్గంలో వైసీపీ టికెట్ ఎవరికంటే..

160

The bullet News (Political)-   గెలుస్తారనుకున్నవారికే సీట్లు ఇస్తామని వైసీపీ చెబుతోంది. ఇందులో భాగంగా అప్పటి వరకు పార్టీని నమ్ముకున్నవారిని సైతం ఒక్కసారిగా పక్కన పెట్టేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో అదే జరిగింది. నియోజకవర్గ ఇంఛార్జ్ గా ఉన్న సుబ్బారావు నాయుడును కాదని ఈమధ్యే పార్టీలో చేరిన పారిశ్రామిక వేత్త దవులూరి దొరబాబుకు పగ్గాలు అప్పగించారు. టికెట్ కూడా దాదాపు కన్ఫామ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో పెద్దాపురం వైసీపీ లో ఒక్కసారిగా ముసలం మొదలైంది. పార్టీ రెండువర్గాలుగా విడిపోయింది. నాలుగేళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న తనని కాదని… ఇప్పుడు వ్యాపార వేత్తలను తెరమీదకు తీసుకరావడంపై భగ్గుమంటున్నారు సుబ్బారావు నాయుడు వర్గం.

దొరబాబు వ్యతిరేక వర్గం నేతలంతా మూకుమ్మడి రాజీనామాలు చేసారు. నాలుగేళ్లుగా విప‌క్ష పార్టీ బాధ్య‌త‌లు మోస్తున్న త‌న‌ను కాద‌ని దొర‌బాబుకి ప‌గ్గాలు అప్ప‌గించ‌డంతో సుబ్బారావు నాయుడు స‌హించ‌లేక‌పోతున్నారు. జిల్లా నాయ‌క‌త్వం బుజ్జగిస్తున్నా.. వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. రాజీనామాలు ఉపసంహరించేది లేదంటున్నారు. సుబ్బారావును కాదని ఇప్పుడు దొరబాబుకు టికెట్ ఇచ్చినా.. ప్రత్యర్ధులకు వరంగా మారుతుందని పార్టీ కేడర్ అంటోంది. తాజా పరిణామాలపై జిల్లా నాయకత్వం తలలు పట్టుకుంటోంది. అధిష్టానం జోక్యం చేసుకుని రాజీ కుదర్చకపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు నాయకులు మరి జగన్ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

SHARE