తాళి కట్టే వేళ..

123

The bullet news(marrege)-కల్యాణమండపంలో బంధుమిత్రుల హడావుడి…వరుడు ముస్తాబై వధువు రాక కోసం ఎదురు చూస్తున్నాడు…అంతలో నాటకీయ ఫక్కీలో వరుడితో తాళి కట్టించుకోవాల్సిన వధువు తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి పారిపోయిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని చన్నకల్ మాలూర్ పట్టణంలో వెలుగుచూసింది. బెంగళూరు నగరానికి 46 కిలోమీటర్ల దూరంలోని పద్మావతి కల్యాణ మండపంలో వరుడు గురేష్ (23) వధువు సౌమ్యకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి సందడి ఆరంభమైంది. వరుడు గురేష్ ముస్తాబై వధువు రాక కోసం పెళ్లి మండపంలో ఎదురుచూస్తుండగా అంతలో వధువు తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయింది. అంతే వధూవరుల కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఎట్టకేలకు వధువుకు చెల్లెలు అయిన బాబాయ్ కూతురైన వెంకటరత్నమ్మ అనే మరో అమ్మాయితో గుర్రేష్ కు వివాహం చేయాలని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయించుకున్నారు. వీరి వివాహానికి సంప్రదాయ బద్ధంగా పూజాదికాలు నిర్వహించారు. విందు కూడా జరిగింది. అంతలో ఈ సారి వరుడు వధువుకు షాకిచ్చి పారిపోయాడు. మొదటి వధువు చేసిన పనికి ప్రతీకారంగా రెండోసారి పెళ్లి ఏర్పాట్లు చేసి ఆపై వధువుకు చేయిచ్చి వరుడు తన ప్రియురాలి కోసం పారిపోయాడు. మొత్తం మీద పెళ్లి కాస్తా జరగక పోవడంతో ఇరు కుటుంబాల పెద్దలు వెళ్లిపోవడంతో పెళ్లి వేడుక కాస్తా ఖాళీగా దర్శనమిచ్చింది. వధూవరులు పారిపోయిన ఘటనలు బెంగళూరులో చర్చనీయాంశంగా మారాయి. పెళ్లి చేసుకోవాల్సిన వధూవరులిద్దరూ పారిపోయి బంధుమిత్రులకు ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇచ్చారు.

SHARE