నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ది కోసం కృషి చేస్తున్నా – మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి

106

The bullet news (Sarvepalli)_ రాష్టం లోటుబ‌డ్జెట్ లో ఉన్నా అన్నివ‌ర్గాల‌ను సంక్షేమ ప‌థ‌కాల ద్వారా సంతృఫ్తి ప‌రుస్తున్న ఘ‌న‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికే ద‌క్కుతుంద‌ని వ్య‌వ‌సాయ‌శాఖామంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి అన్నారు.. పొదలకూరులో ఐదో విడత జన్మభూమి-మా ఊరు ముగింపు కార్యక్రమానికి నియోజ‌క‌ర్గ ఇన్ చార్జి సోమిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డితో క‌లిసి హాజ‌ర‌య్యారు.. ఈ సంద‌ర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వ‌హించారు. అనంత‌రం కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు, విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, ఉద్యాన రైతులకు యాంత్రీకరణ పరికరాల పంపిణీ చేసి మాట్లాడారు.. నియోజ‌క‌వ‌ర్గాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు..తెలుగుదేశం ప్ర‌భుత్వం హ‌యాంలోనే రైతుల‌కు న్యాయం జ‌రుగుతోంద‌న్నారు..

SHARE