420 ఎవరో న్యాయస్థానాలే చెబుతున్నాయి- మంత్రి సోమిరెడ్డి

120

The bullet news ( Venkata Chalam)_ ఎవరికి క్రిమినల్ బ్యాగ్ గ్రౌండ్ ఉందో.. ఎవరు 420 నో ప్రజలు, న్యాయస్థానాలే తీర్పు ఇస్తాయని రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.. సీఎం ధర్మ పోరాట దీక్షకు మద్దతుగా వెంకటాచలంలో నియోజకవర్గ సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డితో కలిసి దీక్ష లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఏప్రిల్ 20 న పుట్టారని ప్రతిపక్ష నేత 420 అని వ్యాఖ్యానిస్తున్నారని ఎవరు 420 యో ప్రజలే నిర్ణయిస్తారన్నారు..చంద్రబాబు జన్మదినాన రాష్ట్రం కోసం 12 గంటల పాటు దీక్ష చేస్తున్నారన్నారు.. పుట్టిన గడ్డ కోసం, తెలుగు ప్రజల అభివృద్ధి కోసం ఈ దీక్ష చేస్తున్నారని ఆయన అన్నారు..చంద్రబాబు 420 అని విమర్శలు చేసిన జగన్ 12 కేసుల్లో ముద్దాయిగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.. మచ్చలేని మా నాయకుడు రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నారని ఆయన వివరించారు.. ఇద్దరి మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన జోస్యం చెప్పారు..

SHARE