వైసీపీ నుంచి టీడీపీలోకి నెక్ట్స్ ఎవ‌రు..?

118

The bullet news (Anantha puram)_ స్వంత పార్టీ నేత‌ల‌ ఆలోచ‌న‌లు వైసీపీని ఇబ్బంది పెట్ట‌బోతున్నాయా..? రాయ‌ల‌సీమ‌లో జ‌గ‌న్ కు గ‌డ్డుకాలం ఎదురుకాబోతుందా..? భ‌విష్య‌త్ పై ఆందోళ‌నలో ఉన్నారా..? వవైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహితంగ మెగిలిన స‌ద‌రు నేత జ‌గ‌న్ వైఖ‌రి న‌చ్చ‌న సైకిళ్లెక్కెందుకు సిద్ద‌మ‌వుతున్నారా..? అనంత‌ర‌పురంలో ఏం జ‌రుగుతోంది..? సైకిలెక్కేందుకు రెఢీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎవ‌రు..? ఇవ‌న్నీ తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ

అనంతపురం నియోజకవర్గంలో వైసీపీకి బ‌ల‌మైన నేత‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి టీడీపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఆది నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న గురునాథరెడ్డి కుటుంబం దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అతి సన్నిహితంగా కొనసాగుతోంది. అనంతపురం ఎమ్మెల్యేగా నారాయణరెడ్డి రెండుసార్లు గెలుపొందారు. ఆయన అనారోగ్యంతో ఉండడంతో తమ్ముడు గురునాథరెడ్డి 2009 ఎన్నికల్లో అనంతపురం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తరువాత వైఎస్‌ మృ తి చెందాక వైసీపీలో చేరి జ‌గ‌న్ వెంట న‌డిచాడు.. అనంత‌రం జ‌రిగిన ఉపఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్దిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మహాలక్ష్మి శ్రీనివాస్‌పై భారీ మెజారిటీతో విజయం సాధించారు.

2014 సాధారణ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థిగా తిరిగి బరిలోకి దిగిన‌ప్ప‌టికీ ఓటమిపాల‌య్యారు. దీంతో అప్ప‌టి నుంచి నియోక‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా కొన‌సాగుతూ ఉన్నారు.. ఇదే స‌మ‌యంలో టీడీపీ మంత్రి ప‌రిటాల సునీతతోనూ, జేసీ దివాక‌ర్ రెడ్డి కుటుంబంతోనూ స‌న్నిహిత సంబంధాలు కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు.. దానికి తోడు ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొందరు టీడీపీ నేతలతో ఆయన మంచి సంబంధాలు ఉన్న‌ట్లు ఆయ‌న కార్య‌క‌ర్త‌లు చ‌ర్చించుకుంటున్నారు.. ఇటీవ‌ల నదీం అహ్మద్‌ను సమన్వయకర్తగా నియమించడంతో గురునాథరెడ్డి మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో అనంతపురం అసెంబ్లీ టికెట్‌ ఆశిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో గురునాథరెడ్డికి టికెట్‌ ఇవ్వరని ఇప్పటికే సంకేతాలు అందినట్లు స‌మాచారం. దీనికి తోడు గురునాథరెడ్డిపై జగన్‌ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పొమ్మనలేక పొగ బెడుతున్నారని ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు. వైసీపీలో కొనసాగడం సందేహమేననే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.

SHARE