వైసిపిని చూసి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు..

103

THE bullet news ( Political ) _ అవును! విప‌క్షం వైసీపీ నేత‌ల్లో దూకుడు ఎంత మాత్ర‌మూ త‌గ్గ‌లేదు. అధినేత జ‌గ‌న్ అడుగు జాడ‌ల్లో న‌డుస్తున్న నేత‌ల్లో 2019 ఎన్నిక‌ల‌పై ఉన్న ధీమా చెక్కు చెద‌ర‌లేదు! ప్ర‌స్తుతం ఈ విష‌య‌మే రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిజానికి 2017 ప‌రిణామాల‌ను తీసుకుంటే ఈ పార్టీకి పెను విషాదంగానే మారిందని చెప్పాలి. అడుగ‌డుగునా అధికార పార్టీ, సీఎం చంద్ర‌బాబు నుంచి గండాలు ఎదుర‌య్యాయి. కోర్టుల నుంచి కూడా ఊప‌శ‌మ‌నం క‌ల‌గ‌లేదు. ఇక‌, టీడీపీ నేత‌ల నుంచి విమ‌ర్శ‌లు కూడా భారీ స్థాయిలోనే ఎదుర‌య్యాయి. దీంతో ఏకైక విప‌క్షంగా ఉన్న వైసీలో పెనుకుదుపులు ఎదుర‌య్యాయి. దీంతో అసలు పార్టీ ఉంటుందా?  ఊడుతుందా? అనే అంశం కూడా తెర‌మీద‌కి వ‌చ్చిందంటే అతిశ‌యోక్తి కాదు. అయినా కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. త‌న మ‌నోబ‌లాన్ని ఎక్క‌డా కోల్పోలేదు. అడుగడుగునా అవాంత‌రాలు ఎదురైనా.. ఆయ‌న మ‌డ‌మ తిప్ప‌లేదు. ఎన్ని విమ‌ర్శ‌లు ఎదురైనా కుంగిపోలేదు. ఫ‌లితంగా పార్టీలోని నేత‌లు కూడా ఆయ‌న వెంటే న‌డిచారు. ఈ ప‌రిణామం మిగిలిన ఏపార్టీలోనైనా ఉండి ఉంటే ఈ పాటికి మ‌రో ప్ర‌జారాజ్యం మాదిరిగా వైసీపీ కూడా విలీనం అయ్యేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. నిజానికి ఈ ఏడాది అత్యంత కీల‌క‌మైన నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌రిగింది. దీనిని జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అబ‌ద్ధాల‌తో పాల‌న సాగిస్తున్న చంద్ర‌బాబుకు నీతికి నిజాయితీకి క‌ట్టుబ‌డ్డ వైసీపీకి మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంగా ఆయ‌న ప్ర‌క‌టించారు. కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని నంద్యాల‌లోని ప్ర‌తి గ‌ల్లీని చుట్టొచ్చారు. ప్ర‌తి ఒక్క‌రినీ ప‌ల‌క‌రించారు. అయితే, అనూహ్యంగా అధికార పార్టీ వేసిన ఎత్తుల్లు, అభివృద్ధి మంత్రం, నిధుల వినియోగంతో వైసీపీ ఓ ద‌శ‌లో గెలుపు అంచ‌ల‌దాకా వ‌చ్చి వెన‌క్కి వెళ్లిపోయింది. ఈ దెబ్బ నిజంగా జ‌గ‌న్‌ను కోలుకోకుండాచేస్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న ఈ అప‌జ‌యాన్ని కూడా స‌వాలుగా స్వీక‌రించారు. ఇక‌, త‌న పార్టీ ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు ఆకర్ష్ మంత్రంతో త‌న జ‌ట్టులోకి చేర్చుకోవ‌డం కూడా పెద్ద సంచ‌ల‌నంగా మారింది. ప‌ద‌వులు ఎర‌వేసి ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేస్తున్నారంటూ జ‌గ‌న్ చేసిన ఆందోళ‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. అయినా కూడా జ‌గ‌న్ వెర‌వ‌లేదు. ప్ర‌జాక్షేత్రంలోనే త‌న‌ను తాను నిరూపించుకుంటానంటూ ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందే.. ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌య్యారు. చంద్ర‌బాబు పాల‌న‌లోని డొల్ల‌త‌నాన్ని ఎండ‌గ‌ట్టారు. ఇక‌, మిగిలిన ఎమ్మెల్యేలు, నేత‌ల‌ను కాపాడుకుంటూనే రాజ‌కీయంగా తాను చేయాల్సిన ప‌ని తాను చేస్తున్నారు. ఇక‌, మిగిలిన వారు అంద‌రూ కూడా జ‌గ‌న్‌ను అనుస‌రిస్తున్నారు. జ‌గ‌న్ లోని ధైర్యాన్ని చూసి ముచ్చ‌ట‌ప‌డుతున్న నేత‌లు ఆయ‌న‌ను అనుస‌రించాల్సిందేన‌ని నిర్ణ‌యించుకుని న‌డుస్తున్నారు. కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ వైసీపీ అప‌జ‌యం సాధించినా నేత‌లు మాత్రం కుంగిపోలేదు. 2019 ఎన్నిక‌లే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. మొత్తానికి వైసీపీని బ‌ద్నాం చేయాల‌ని అధికార పార్టీ అధినేత చంద్ర‌బాబు ఎంత‌గా ప్ర‌య‌త్నించినా జ‌గ‌న్ మాత్రం మొండి ప‌ట్టుద‌ల‌తో ముందుకు వెళుతున్నాడు.

SHARE