పెళ్లాలే ప్రాణాలు తీస్తుంటే..

136

The bullet news ( Hyderabad ) – మొన్న స్వాతి. నిన్న జ్యోతి. నేడు శ్రీవిద్య. అక్రమ సంబంధం మోజులో భర్తలనే కడ తేర్చారు ఆ ముగ్గురు. ప్రియుడితో కలిసి హంతకులుగా మారారు. వరుస ఘటనలతో పోలీసులే షాక్‌ అవుతున్నారు. భార్యాభర్తల బంధం ప్రశ్నార్థకంగా మారుతోంది. స్వాతి, జ్యోతి, శ్రీవిద్య.. ముగ్గురి విషయంలో అనేక సారూప్యతలున్నాయి. వివాహేతర సంబంధం వల్లే వీళ్లు ముగ్గురు భర్తలను చంపేశారు. స్వాతి మొగుడికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేస్తే.. జ్యోతి పాలల్లో స్లీపింగ్‌ టాబ్లెట్స్ కలిపి తాగించింది. ఇక శ్రీవిద్య అయితే.. ఏకంగా మద్యంలో సైనైడ్‌ కలిపి భర్తను బలితీసుకుంది. ఈ ముగ్గురూ అత్యంత కిరాతకంగా మొగుడ్ని కడతేర్చి కసాయిలుగా మిగిలారు.హత్య తర్వాత సాక్ష్యాలు దొరక్కుండా.. డెడ్‌బాడీలను మాయం చేసే ప్రయత్నం కూడా చేశారు. స్వాతి.. సుధాకర్‌రెడ్డి మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి దహనం చేస్తే..

జ్యోతి, శ్రీవిద్యలు లవర్స్‌ సాయంతో భర్త డెడ్‌బాడీని కాలువలో పడేశారు. ఈ మూడు కేసులు దర్యాప్తు చేసిన పోలీసులకే వణుకు పుట్టించాయి. అక్రమ సంబంధం కోసం.. భార్యలు ఇంతటి దారుణాలకు తెగిస్తారా?

వివాహ బంధం కంటే.. అక్రమ సంబంధమే వారికి ముఖ్యమైందా? కొందరు భార్యలు ఎందుకిలా బరితెగిస్తున్నారు? ఏమై పోతున్నాయి వివాహ విలువలు?భర్తను చంపిన భార్య ఉదంతాలు పెరుగుతుండటం కలవరపాటుకు గురి చేస్తోంది.

SHARE