The bullet news (Kakinada)-  అభివృద్దిని కోరుకునే ప్ర‌తి ఓట‌రూ టీడీపీకి ఓటెయ్యాల‌ని కాకినాడ ఎన్నికల ఇన్‌చార్జ్, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఓట‌ర్ల‌ను అభ్య‌ర్దించారు. కాకినాడలోని 49వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి ఉషారాణి తరుపున ఆయ‌న‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సామాజిక సేవా దృక్పథంతో తెలుగుదేశం అభ్యర్థి ఉషారాణిని గెలిపించాలని ఆయ‌న కోరారు.. వైసీపీ నీచ రాజ‌కీయాలు చేస్తుంద‌న్న ఆయ‌న 2019 ఎన్నిక‌ల లోపు వైసీపీ క‌నుమ‌రుగ‌వుతుంద‌న్నారు.. ఈ ప్ర‌చారంలో ఎమ్మెల్యేలు గోరుంట్ల బుచ్చియ్యచౌదరి, గొల్లపల్లి సూర్యరావు, పిల్లి అనంత లక్ష్మి, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరావు, వర్మ, మాజీ ఎమ్మెల్సీ చైతన్య రాజు త‌దిత‌ర‌లు పాల్గొన్నారు

SHARE