అభాగ్యుల కన్నీరు తుడుస్తూ…

116

The bullet news (Venkata Giri)- ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అనారోగ్య కారణాలతో మరణించిన వారికి అంత్యక్రియల కోసం ఇచ్చే ఆర్దికసాయాన్ని మాత్రం ఆపే ప్రసక్తేలేదని వెంకటగిరి మునిసిపల్ చైర్ పర్సన్ దొంతు శారదా అన్నారు. ఇవాళ
వెంక‌ట‌గిరిలోని బిసి కాలనీ, 3వ వార్డు లో పింజల రాములమ్మ అనారోగ్య కారణాలతో మరణించారు.. విషయం తెలుసుకున్న చైర్ పర్సన్ దొంతు శారదా ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.. ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆమె తన స్వంత నిధుల నుంచి రూ.3000 ఆర్దిక సహాయం అంద‌జేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభాగ్యుల కన్నీళ్లు తుడవడంలోనే తనకు సంత్రుప్తి ఉందన్నారు.. ఈ కార్యక్రమంలో సాయితేజ, గిరి, మోహన్, ఎస్ కే భాష, సుబ్బారావు, శ్రీనివాసులు, కుమార్, వెంకటేశ్వర్లు, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.

SHARE