ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. వెంకటగిరిలో మహిళా దినోత్సవ వేడుకలు..

146

THE BULLET NEWS (VENKATAGIRI)-వెంకటగిరి మునిసిపల్ చైర్పర్సన్ దొంతు శారదా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.. పట్టణంలోని ఆర్వీఎం గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో మహిళామణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. అనంతరం దొంతూ శారదా ను ఘనంగా సన్మానించారు.. ఈ సందర్భంగా శారదా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి పధంలో ముందుకు వెళ్తుందన్నారు.. ఇంట్లోనే కాదు సమాజంలో కూడా మహిళలను గౌరవించండం ప్రతి ఒక్కరు నేర్చుకోవలన్నారు.. మహిళలు మాట్లాడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా అందరిని ఒక వేదిక పైకి తీసుకొచ్చి వారిలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని నింపిన చైర్పర్సన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..శారదా నేతృత్వంలో లో మహిళలకు క్రిడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.. బహుమతుల అనంతరం వారికి ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేశారు..

SHARE