ప్రపంచ రక్తదాతల దినోత్సవం..

79

THE BULLET NEWS (NELLORE)-  రక్త గ్రూపులు కనుగొన్న శాస్త్రవేత్త, రక్తమార్పిడి వైద్య పితామహులు డాక్టర్‌ కార్ల్‌ ల్యాండ్‌ స్టైనర్‌ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్‌ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ రక్తనిధి ఘనంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా గురువా రం సమావేశం నిర్వహిస్తున్నామని దానికి జిల్లా కలెక్టరు ఆర్‌ ముత్యాలరాజు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని నెల్లూరు రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ ఎ.వి సుబ్రహ్మణ్యం బుధవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. గాంధీ బొమ్మ నుంచి రెడ్‌క్రాస్‌ రక్తనిధి వరకుర్యాలీ, రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, రక్తదాతలు, రెడ్‌క్రాస్‌ జీవిత సభ్యులు, ఔత్సాహికులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

SHARE