పొరపాటు చేసాం..

90

The bullet news (Sports)-  బ్యాటింగ్ వైఫల్యం వల్లే తాము ఘోర పరాజయం పాలయ్యామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తెలిపారు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం కోహ్లీ విలేకరులతో మాట్లాడుతూ… మ్యాచ్ ఓటమికి తాము అన్నివిధాలా అర్హులమే అని అన్నారు. బ్యాటింగ్ తీరు తీవ్ర నిరాశజనకంగా ఉందన్నారు. సుదీర్ఘ ఐదు టెస్టుల్లో తొలిసారి మేం గొప్పగా ఆడటంలో తేలిపోయామన్నారు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు వాతావరణ పరిస్థితులపై ఆధారపడొద్దని పేర్కొన్నారు. తుది జట్టు ఎంపికలో పొరపాటు జరిగింది.. అదనపు సీమర్ లేకపోవడంతోనే ప్రత్యర్థులను కట్టడి చేయలేకపోయాం అని కోహ్లీ స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.. క్రిస్‌ వోక్స్‌ సెంచరీ ఇంగ్లాండ్ విజయంలో కీలకం అని అన్నారు. నన్ను వెన్నునొప్పి బాధిస్తోంది. అయితే మూడో టెస్టుకు ఐదు రోజుల సమయం ఉంది కనుక తప్పకుండా కోలుకుంటానని కోహ్లి తెలిపారు.

SHARE