వైసీపీ అధికారంలోకి వస్తేనే అన్ని సమస్యలు పరిష్కారం – ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి..

96

The bullet news ( ఆత్మకూరు ) :- వైసీపీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు.. మర్రిపాడు మండలం, పల్లవోలు పంచాయతీ పరిధిలోని తిక్కవరంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు.. రాబోవు రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిలా గా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.. స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు..ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులునాయుడు ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు అల్లారెడ్డి ఆనందరెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

SHARE