కొణతాల అనుచరుడు కిశోర్‌తో వైసీపీ నేత అమర్‌ భేటీ

103

The bullet news (Visakha)- మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ముఖ్య అనుచరుడు మలసాల కిశోర్‌ని వైసీపీ జిల్లా కన్వీనర్‌ గుడివాడ అమర్‌నాథ్‌ కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అమర్‌తోపాటు వైసీపీ జిల్లా ప్రధానకార్యదర్శి దంతులూరి శ్రీధర్‌రాజు, పార్టీ మండల అధ్యక్షుడు గొల్లవిల్లి శ్రీనివాసరావు, లగిశెట్టి గణేష్‌, తదితరులు మంగళవారం అమీన్‌సాహెబ్‌పేటలో కిశోర్‌ నివాసానికి వచ్చి ఆయనను కలిశారు. వైసీపీలో చేరాలని కిశోర్‌ని ఈ సందర్భంగా వారు కోరినట్టు తెలిసింది. తాను కొణతాల వెంటే తాను ఉంటానని, ఆయన పార్టీలో చేరితే తాను కూడా ఆ పార్టీలో చేరతానని కిశోర్‌ చెప్పినట్టు సమాచారం. ఇదిలావుండగా కిశోర్‌ని కలిసిన విషయమై వైసీపీ నాయకులను సంప్రదించగా, అమర్‌నాథ్‌ రానున్న ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీచేయనున్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగా ముఖ్యనాయకులను కలుస్తున్నామని చెప్పారు.

SHARE