చైన్ స్నాచింగ్స్ పై గళమెత్తిన వైసీపీ మహిళా విభాగం

86

The Bullet News ( Nellore )_ నెల్లూరు నగరంలో జరుగుతున్న చైన్ స్నాచింగులు, దొంగతనాలపై వైసిపి మహిళా విభాగం గళమెత్తింది.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు ఆర్టీసీ వద్ద శాంతియుతంగా ధర్నా నిర్వహించారు..నగరంలో జరుగుతున్న వరుస చైన్ స్నాచింగ్ లను అరికట్టాలని వైసిపి మహిళా నేతలు డిమాండ్ చేశారు.. మహిళలు ఒంటరిగా బయటికి రావాలంటేనే భయపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.. చైన్ స్నాచర్స్ నుంచి ఆడపడుచులకు రక్షణ కలిపించాలని వారు డిమాండ్ చేశారు.. ఆడపిల్లలకు ఆకతాయిల వేధింపులు సైతం అధికమవుతాయని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.. నగరంలో చైన్ స్నాచింగ్లు, దొంగతనాలు జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయని, వాటికి చెక్ పెట్టె విధంగా పోలీసులు పని చెయ్యాలని వారు కోరారు..

SHARE