నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టిన వైఎస్‌ జగన్‌

54

The bullet news (Sulurpeta)_ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిచింది. 69వ రోజు వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జగన్‌కు ఘనస్వాగతం పలికారు. రాయలసీమలో పాదయాత్ర ముగించుకుని సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పీసీటీ కండ్రిగ వద్ద నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టిన జననేతకు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటీ సంజీవయ్య, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తదితర నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు. రాజన్న తనయుడికి ప్రజలు అడుగడుగునా జననీరాజనాలు పలుకుతున్నారు.

కాగా, నెల్లూరు జిల్లాలోనే వైఎస్‌ జగన్‌ పాదయాద్ర  ఈనెల 28వ తేదీన 1,000 కిలో మీటర్ల మైలురాయిని అధిగమించనుంది. ఈ నేపథ్యంలో ‘వాక్‌ విత్‌ జగనన్న’ (జగనన్నతో నడుద్దాం) అనే కార్యక్రమం చేపట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు నిచ్చింది. దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలు 700కు పైగా ప్రదేశాల్లో ఏక కాలంలో వైఎస్‌ జగన్‌కు సంఘీభావం తెలుపుతూ ఆరోజున పాదయాత్రను చేపట్టనున్నారు.

SHARE