వైసిపి రాజ్యసభ అభ్యర్థి గా వీపీఆర్ ను నిలబెడతాం – విజయసాయిరెడ్డి

79

The bullet news (  Visakha) _త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ తరుపున వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని నిలబెడుతున్నామని ఆపార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. శనివారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… మాకు 44 మంది ఎమ్మెల్యేల మెజార్టీ ఉందని, అయితే… టీడీపీ అప్పుడే ప్రలోభాలు మొదలుపెట్టిందని ఆయన ఆరోపించారు. కళా వెంకట్రావు మా ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకోవడం ఒక్కటే తక్కువ అని, ఆయన ఆ స్థాయికి దిగజారిపోయారని, రాయలసీమలో టీజీ వెంకటేష్ కూడా ఇదే పనిలో ఉన్నారని విజయసాయి పేర్కొన్నారు. యరపతినేని శ్రీనివాసరావు హవాలా ద్వారా డబ్బులు సమకూర్చే పనిలో ఉన్నారని, అచ్చెన్నాయుడు విలువలులేని మంత్రి అని ఆయన పేర్కొన్నారు. అలాగే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర, అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. మేం అధికారంలోకి వచ్చాక వీరందరిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని, రేషనలైజేషన్ పేరుతో ఎస్సీ హాస్టల్స్‌ను మూసివేసి నారాయణ సంస్థలకు లాభం చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విజయసాయిరెడ్డి అన్నారు.

SHARE