నిన్న పెళ్లి.. నేడు బలవన్మరణం

100

The bullet news(crime)- తన అక్క కుమార్తెతో సోమవారం వివాహం చేసుకున్న మునిరాజు (30) అనే వ్యక్తి, మంగళవారం వేకువ జామున బలవన్మరణానికి పాల్పడ్డాడు. జిల్లా కేంద్రం చిక్కబళ్లాపుర సమీపంలోని సూలికుంటె గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిక్కబళ్లాపురలోని గురురాజ కల్యాణ మంటపంలో వివాహాన్ని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు. సోమవారం రాత్రి వారికి సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఆ సమయంలో భార్యతో అన్యమనస్కుడిగానే ఉన్నాడట. మంగళవారం వేకువ జామున మరో గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్క కుమార్తెను వివాహం చేసుకోవటం ఇష్టం లేనప్పటికీ బలవంతంగా వివాహం చేశారని- ఆమెను తన సోదరుడికే ఇచ్చి వివాహం చేయాలని రాసిన ఉత్తరాన్ని చిక్కబళ్లాపుర గ్రామీణ ఠాణా పోలీసులు స్వాధీనపరచుకున్నారు

SHARE