రాజ్యసభ కోసం నువ్వా..నేనా..? టీడీపీలో పెరుగుతున్న ఆశావాహులు

89

THE BULLET NEWS –

వచ్చే మార్చినాటికి జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం తెలుగుదేశం పార్టీలో విపరీతమైన పోటీ నెలకొంది. పార్టీకి చెందిన నేతలతో పాటు, బడా పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాలకు చెందిన వారు రాజ్యసభ సభ్యత్వం కోసం ఇప్పటి నుంచే కసరత్తులు చేసుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్‌ నుంచి మూడు స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘దేవందర్‌గౌడ్‌, సిఎం రమేష్‌, చిరంజీవిలు మార్చి నాటికి రిటైర్‌ అవుతారు. వీరిలో ‘దేవందర్‌గౌడ్‌, సిఎం రమేష్‌లు’ టిడిపికి చెందిన వారు కాగా ‘చిరంజీవి’ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు. ఈ ముగ్గురికీ మళ్లీ రాజ్యసభ అవకాశం దక్కే ఛాన్స్‌ లేదు. ‘చిరంజీవి’ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వ్యక్తికావడం, ఆయన పార్టీకి శాసనసభలో ప్రాతినిధ్యం కరవడంతో ఆయన పోటీ పడే పరిస్థితే లేదు. కాగా తెలంగాణకు చెందిన ‘దేవేందర్‌గౌడ్‌’ ఇప్పటికే అనారోగ్యంతో సతమతమవుతున్నారు. దీంతో ఆయనకు అవకాశం దక్కదు. మరో సభ్యుడు సిఎం రమేష్‌కు అవకాశం దక్కుతుందా…? లేదా అనేదానిపై టిడిపిలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో ‘సుజనాచౌదరి, సిఎం రమేష్‌’లు గట్టిగాపోరాడారనే అభిప్రాయం ఉంది. అయితే తరువాత కాలంలో సిఎం రమేష్‌పై పార్టీ అగ్రనాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉందని ప్రచారం జరుగుతోంది.ఆయన కడప రాజకీయాల్లో టిడిపికి ప్రతిబంధకంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్‌కు చెందిన కెవిపి రామచంద్రరావుతో కలసి వ్యాపారాలు చేస్తున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో ఆయనకు ‘చంద్రబాబు’ అవకాశం ఇవ్వరని పార్టీనాయకులు కొందరు బల్లగుద్ది చెబుతున్నారు. దీంతో రిటైర్‌ కానున్న ముగ్గురికీ మళ్లీ అవకాశాలువచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.

ఇది ఇలా ఉండగా మొత్తం మూడు స్థానాలు టిడిపికి దక్కే పరిస్థితులు కనిపిస్తుండడంతో పలువురు రాజ్యసభ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఆర్థికమంత్రి ‘యనమల రామకృష్ణుడు’ ముందు వరసలో ఉన్నారంటున్నారు. ఒక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించి, గౌరవంగా రాజ్యసభకు పంపించాలని యోచిస్తున్నారట. టీడీపీలో సీనియర్‌ అయిన ఈ మంత్రి వల్ల తూర్పుగోదావరి జిల్లాలో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అక్కడ నాయకులు ఫిర్యాదు చేయగా..త్వరలో మీకు బరువు దించుతానని ‘యనమల’ను దృష్టిలో ఉంచుకుని ‘చంద్రబాబు’ చెప్పారట. దీంతో ‘యనమల’కు రాజ్యసభ స్థానం దక్కడం దాదాపు ఖాయమే. అంతే కాకుండా ‘యనమల’కు అవకాశం ఇస్తే బీసీలకు అవకాశం ఇచ్చినట్లు కూడా ఉంటుంది.

ఇక ‘రెడ్డి’ సామాజిక వర్గం నుంచి కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ‘సతీష్‌కుమార్‌రెడ్డి’ అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. అదే విధంగా నెల్లూరు జిల్లా నుంచి ‘ఆదాల ప్రభాకర్‌రెడ్డి’, మంత్రి సోమిరెడ్డి బంధువైన ‘వేమిరెడ్డి’కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ‘రెడ్డి’ సామాజికవర్గానికి చెందిన యువకులు ‘జగన్‌’ వైపు ఉన్న నేపథ్యంలో ఆ వర్గం నుంచి పైన చెప్పిన ముగ్గురిలో ఎవరికో ఒకరికి అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దళిత వర్గం నుంచి ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ‘జూపూడి ప్రభాకర్‌రావు’, మాజీ స్పీకర్‌ ప్రతిభాభారతిలు రంగంలో ఉన్నట్లు చెబుతున్నారు. వీరిలో మహిళా కోటాతో పాటు దళిత కోటాలో తనకు అవకాశం వస్తుందని ‘ప్రతిభాభారతి’ భావిస్తున్నారట. అయితే ఆమె ఇన్‌ఛార్జిగా ఉన్న నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై పార్టీ అధిష్టానం ఆగ్రహంగా ఉందన్న ప్రచారం ఆమె అవకాశాలపై ప్రభావం చూపవచ్చు. వరుసగా మూడుసార్లు ఓడిపోవడం, పార్టీ కార్యకర్తలకు దూరం అవడం వంటి అనర్హతలు ఆమెను వెంటాడుతున్నాయి.

‘కమ్మ’ సామాజికవర్గం నుంచి పలువురు రాజ్యసభ సభ్యత్వం కోసం పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో ‘సుజనాచౌదరి’కి అవకాశం ఇవ్వడంతో ఈసారి మళ్లీ ఆ వర్గానికి ఇస్తారా..? ఒక వేళ ఇస్తే ఎవరికి ఇస్తారనే దానిపై స్పష్టత లేదు. అయితే మాజీ రాజ్యసభ సభ్యుడు ‘కంభంపాటి రామ్మోహన్‌రావు’ తాను రేసులో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఈనాడు సంస్థల అధిపతి ‘రామోజీరావు’ బంధువు ఒకరు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. వారు కాకుండా మీడియా వర్గానికి చెందిన మరో ఇద్దరు న్యూస్‌ ఛానెల్స్‌ యజమానులు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. ఇక పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ కుటుంబం నుంచి ‘హరికృష్ణ’ తనకు కావాలని అడిగే అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా…ఇప్పటికే పలువురు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ అధినేత చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికల సమీపించేనాటికి మరికొంత మంది వీరికి తోడైయ్యే అవకాశం ఉంది. అయితే రాజ్యసభ సభ్యుల ఎంపికలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు ‘లోకేష్‌’లదే తుది నిర్ణయమని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

SHARE