మీకు.. మేమున్నాం…

121

The bullet news (Venkata Giri) -వృద్దాప్యంలో కొడుకులు వ‌దిలేసిన వారికి.. అంద‌రూ ఉండి కూడా అభాగ్యులైన వారికి మేమున్నాంటూ దాతృత్వాన్ని చాటుతున్నాయి కొన్ని స్వ‌చ్చంద సంస్థ‌లు.. అభాగ్యుల‌ను అక్కున చేర్చుకుంటూ ఆక‌లి తీరుస్తున్నాయి.. నిలువ నీడ‌లేనివారికి అండ‌గా నిలుస్తున్నాయి..

సింహపురి యూత్ అసోసియేషన్ మరియు ఉజ్వల సేవాసమితి సంయుక్త ఆధ్వర్యంలో గ‌త రాత్రి వెంకటగిరి ప‌ట్ట‌ణంలోని నిరాశ్రయుల‌కు దుప్ప‌ట్లు, ఆహార‌పొట్లాలు పంపిణీ చేశారు.. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు మాట్లాడుతూ ఎముకలు కొరికే చలిలో ఫుట్ పాత్ పై , దేవాలయాల దగ్గర ,రైల్వే స్టేషన్ దగ్గర నిద్ర‌పోతున్న‌వారికి దుప్పట్లు, ఆహారం అంద‌జేశామ‌న్నారు.. అలాంటి అభాగ్యులుక త‌మ సంస్థ‌లు ఎల్ల‌ప్పుడు అండగా ఉంటాయ‌న్నారు.. త‌మ మిత్రులు, శ్రేయోభిలాషుల స‌హ‌కారంతో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించామ‌న్నారు.. అభాగ్యుల‌ను ఆదుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రూ ముందుకు రావాల‌న్నారు. ప్ర‌భుత్వాలు కూడా ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ప్ర‌త్యేక సంక్షేమ ప‌థ‌కాలు అమలు చేయాల‌న్నారు.. నిరాశ్ర‌యులు ఆశ్ర‌యం క‌ల్పించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు..

SHARE