భగత్ సింగ్ ని యువత ఆదర్శంగా తీసుకోవాలి..

126

THE BULLET NEWS(GUDUR)- భారతమాత బానిస సంకెళ్లు విడిపించేందుకు బ్రిటిష్ వాళ్ల పై అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు భగత్ సింగ్ అని గూడూరు డివిజన్ ఎబివిపి నాయకులు మనోజ్ అన్నారు.. ఈరోజు భగత్ సింగ్ జయంతి ని పురస్కరించుకుని గూడూరు లోని కేశవ నిలయంలో జయంతి నిర్వహించారు.. ఈ సందర్భంగా నగర కార్యదర్శి చిన్న, సహ కార్యదర్శి సూర్య మాట్లాడుతూ దేశం కోసం చిన్న వయస్సులోనే ప్రాణాలు అర్పించిన నాయకుడు భగత్ సింగ్ అన్నారు.. యువత భగత్ సింగ్ ని స్ఫూర్తి గా తీసుకోవాలన్నారు… స్వాతంత్రం కోసం జైల్లో ఉంటూ 64 రోజుల పాటు నిరాహారదీక్ష చేశారని ఆయన సేవలను కొనియాడారు.. ఈ కార్యక్రమంలో నగర కన్వీనర్ ప్రశాంత్, హేమంత్, చిన్న పాల్గొన్నారు.

SHARE