మీ ఆప్యాయ‌తలే.. నాకు ఆశీర్వాదాలు – గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్

105

The bullet news (Gudur)- ఇంటింటికి వెళ్తూ.. పేరుపేరునా అంద‌రినీ ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ.. స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటూ.. వాటిని ప‌రిష్క‌రిస్తూ… నెల్లూరుజిల్లా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ చేప‌డుతున్న‌ ఇంటింటికి తెలుగుదేశం కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి అనుహ్య స్పంద‌న వ‌స్తోంది.. ఇవాళ‌ చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామ పంచాయతీలోని మన్నెమాల, కోతలగుంట గ్రామాల్లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.. ఇంటింటికి వెళ్లి ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప‌థ‌కాల‌ను ఎమ్మెల్యే ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుని వాటికి త‌క్ష‌ణ‌మే ప‌రిష్కార మార్గం చూపుతూ ముందుకు సాగారు.. అంత‌కుముందు రూ. 13 లక్షలతో ఈశ్వరవాకలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు… అలాగే రూ.5 లక్షలతో మన్నెమాల అరుంధతివాడలో మాతమ్మగుడి రోడ్డుకు శంఖుస్థాపన చేశారు.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ అభివృద్దే అజెండాగా తాను కృషి చేస్తున్నాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు.. త‌న ప‌రిధిలో ఉన్న ఏ అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తాన‌న్న ఆయ‌న త‌న ప‌రిధిలోని లేని వాటిని అవ‌స‌ర‌మైతే ముఖ్య‌మంత్రితో మాట్లాడైనా ప‌రిష్క‌రించేందుకు సిద్దంగా ఉన్నాన‌న్నారు.. మీరు చూపించే ఆప్యాయ‌త‌లే త‌న‌కు ఆశీర్వాదాల‌న్నారు.. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక టీడీపీ నాయ‌కులు పాల్గొన్నారు..

SHARE