జగన్ @ 1500 కి.మీ…

98

THE BULLET NEWS (GUNTUR)-

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయిని దాటింది. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకుదురు వద్ద వైఎస్‌ జగన్‌ పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన ములుకుదురులో మొక్కను నాటారు. వైఎస్‌ జగన్‌ 2017 నవంబర్‌ 6న  వైఎస్‌ఆర్‌  జిల్లా ఇడుపుల‌పాయ‌లో ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించిన విషయం విదితమే.

ఈ 1500 కిలోమీటర్ల దారిలో ఎన్ని నియోజకవర్గాలు, ఎన్ని ఊళ్లు, ఎందరు ప్రజలు, ఎన్ని సమస్యలు…సహనంతో వాటిని వింటూ, ప్రజలకి భరోసాని పంచుతూ ముందుకు సాగుతున్నారు ప్రతపక్ష నేత. 180 రోజులపాటు 125 నియోజకవర్గాల్లో 3వేల కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగనుంది. ఇప్ప‌టి వ‌ర‌కు వైఎస్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాల్లో పాద‌యాత్ర పూర్తి కాగా ఈ నెల 12న గుంటూరు జిల్లాలోని ప్ర‌వేశించింది.

SHARE