పాదయాత్రలో జగన్‌ ‘జంప్‌’ చూశారా..?

124

THE BULLET NEWS – పలకరించే జనం మధ్య ఉరకలేసే ఉత్సాహంతో వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 3100 కిలో మీటర్ల మైలురాయిని చేరుకుంది. అభిమాన నేత కోసం వైసీపీ శ్రేణులు పూలబాటలు.. మంగళహారతులు ఎక్కడికక్కడే సిద్ధం చేస్తుండగా.. ఇవాళ ఓ బురద గుంట జగన్‌కు ఎదురుపడింది. క్షణం కూడా ఆలోచించని ఆయన.. ఒక్క ఉదుటన ‘లాంగ్‌ జంప్‌’ చేసి ఆ బురద గుంటను దాటేశారు. ఆయన ఫిట్‌నెస్‌ను చూసి అక్కడి వారు ఔరా అనుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. గతంలో జగన్‌ ఓసారి బంగీ జంప్‌ చేసిన విషయాన్ని ఆయన అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు.

SHARE