హైదరాబాద్‌ సెంట్రల్‌ మాల్‌లో ‘యువరాజ్ ‘

111

THE BULLET NEWS (HYDERABAD)-టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్‌ సింగ్‌ తన స్పోర్ట్స్‌ బ్రాండ్‌ ‘యూవీకెన్‌’ను పంజాగుట్టలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ మాల్‌లో మంగళవారం ప్రారంభించారు. ఈ మాల్ లో యూవీకెన్‌ బ్రాండ్‌కు చెందిన స్పోర్ట్స్‌ దుస్తులు, టోపీలు, యాక్సెసరీలు, ఎక్యూప్‌మెంట్‌ లు ఉంటాయి. అనంతరం యూవీ మాట్లాడుతూ… క్యాన్సర్‌ బారిన పడిన వారికి సహకారం కల్పించేందుకు యూవీకెన్‌ ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే పేరుతో స్పోర్ట్స్‌ వస్త్రాల బ్రాండ్‌నూ ఏర్పాటు చేసి.. వచ్చే లాభాలను ఫౌండేషన్‌ కు ఖర్చుచేయనున్నట్లు తెలిపారు. యూవీకెన్‌ బ్రాండ్‌ స్టోర్‌లు అన్ని సెంట్రల్‌ మాల్స్‌లోనూ అందుబాటులో ఉంటాయన్నారు. యువరాజ్‌సింగ్‌ సెంట్రల్‌ మాల్‌ వద్దకు వచ్చాడని సమాచారం తెలుకున్న క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరున్నారు. దీంతో పంజాగుట్ట ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

SHARE