నేడు గూడూరు లో తిరుపతి ఉప ఎన్నికల పై విస్తృత స్థాయి సమావేశం..

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుపతి ఉప ఎన్నికలను తీసుకొని ఇప్పటికే తిరుపతి పార్లమెంట్ పరిధిలోని అన్నీ నియోజకవర్గ పరిధిలో నూతన కమిటీలు ఏర్పాటు చేసి, మండల, గ్రామ స్థాయి బూతు కమిటీలు, పార్టీలో అన్నీ విభాగాల కమిటీలు ఏర్పాటుచేశారు,అదేవిధంగా మండల,నియోజకవర్గ స్థాయిలోను పరిశీలకులను నియమించారు,గ్రామ స్థాయి నుండి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు అన్నీ చర్యలు చేపట్టారు, ఈ నేపథ్యంలోనే గూడూరు పట్టణంలోనీ విష్ణు సాయి కళ్యాణమండపం( సాయిబాబా గుడి దగ్గర) తిరుపతి ఉప ఎన్నికలలో భాగంగా గూడూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలోనిర్వహిస్తున్నారు, ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాశం మాట్లాడుతూ 27 తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకుగూడూరు పట్టణంలో ని విష్ణు సాయి కళ్యాణమండపం( సాయిబాబా గుడి దగ్గర) నందు విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది అనీ ఆయన తెలిపారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా మాజీ మంత్రి తిరుపతి ఉప ఎన్నికలగూడూరు నియోజక వర్గ పరిశీలకులు ఎన్ అమర్నాధ్ రెడ్డి, మాజీమంత్రి పోలిట్ బ్యూరోసభ్యులుసోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్సి ీదా.రవిచంద్ర,తిరుపతి-చిత్తూరుపార్లమెంట్ యోజకవర్గాలసమన్వయకర్తఎం,ఉగ్రనరసింహా రెడ్డి, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జి.నరసింహా యాదవ్ , తిరుపతి ఉప ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులుపనబాక.కృష్ణయ్య, పట్టణ మరియు మండల పరిశీలకులుహాజరుకానున్నారు అనీ వెల్లడించారు, తిరుపతి ఉప ఎన్నికల విస్తృత స్థాయి సమావేశానికి నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశంపార్టీనాయకులు,కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలిఅయనపిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here