ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమల సర్వే కార్యక్రమం

నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని డి.ఆర్.డి.ఏ భవనంలో మంగళవారం.., కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు ఆధ్వర్యంలో ” ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమల సర్వే ” ట్రెయినింగ్ వర్క్ షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ…, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే ఏపీ నంబర్ 1 స్థానాన్ని సంపాదించుకుందని.., రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు మెరుగైన అవకాశాలున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమల సర్వేని.., జిల్లాలో పటిష్ట ప్రణాళికతో నిర్వహించాలని అధికారులకు, శిక్షణకు హాజరైన లీడ్ ఆఫీసర్లకు తెలిపారు. జిల్లాలో నైపుణ్యం కలిగిన యువత, పరిశ్రమల స్థాపనకు అవసరమైన వసతి, సదుపాయాలు, కృష్ణపట్నం ఓడరేవు ఉందని.., దీంతోపాటు చెన్నై నగరం జిల్లాకు సమీపంలో ఉండటం వలన పారిశ్రామిక వేత్తలు ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇస్తారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు, లీడ్ ఆఫీసర్ల మండలాల వారీగా ఏ ఏ పరిశ్రమలు ఉన్నాయి..? ఆ పరిశ్రమల్లో తయారవుతున్న ఉత్పత్తులతో పాటు…? ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమల సర్వేలో సూచించిన అన్ని అంశాలను వారం రోజుల్లోపు సేకరించాలన్నారు. జిల్లాలో సుమారు 5000 ఎం.ఎస్.ఎం.ఈలు ఉన్నాయని.., ప్రతి లీడ్ అధికారి, గ్రామ సచివాలయాలతో సమన్వయం చేసుకుంటూ…, ఏపీ సమగ్ర పరిశ్రమల సర్వే పూర్తి చేయాలన్నారు. దీంతో పాటు.., నిర్వహణలో ఉన్న పరిశ్రమల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయా..? కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ కార్మికుల చేత పనిచేయిస్తున్నారా? ఫైర్ సేఫ్టీ నిబంధనలు అమలవుతున్నాయా అనేది కూడా పరిశీలించాలని.., ఆ పరిశ్రమ యజమానులకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అవసరమో కూడా గమనించి సమగ్ర సర్వే రిపోర్ట్ తయారు చేయాలన్నారు. లీడ్ అధికారుల విజిటింగ్ షెడ్యూల్ ని ఒకరోజు ముందే వారు సందర్శించబోయే పరిశ్రమ ప్రతినిధులకు అందిస్తే.., ప్రణాళికా బద్దంగా అన్ని వివరాలు త్వరితగతిన సేకరించగలరని.., కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ( ఆసరా) శ్రీ సూర్య ప్రకాశరావు మాట్లాడుతూ.., ఆర్థికాభివృద్ధి సాధించాలంటే వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగంలో ప్రగతి సాధించాలన్నారు. జిల్లాలో అగ్రికల్చర్ తో పాటు.., పరిశ్రమలు, సేవారంగం అభివృద్ధికి ఎన్నో మెరుగైన వసతులున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమల సర్వేలో ప్రతి మండలంలో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయో..? ఆ పరిశ్రమల్లో ఉత్పత్తి అయ్యే ఉత్పత్తుల్లో ఎగుమతి, దిగుమతులు ఏ ఏ రంగాలకు చెందినవో కూడా తెలుసుకోవాలన్నారు. దీనివల్ల భవిష్యత్తులో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ప్రణాళిక రూపొందించడంలో ఈ వివరాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జి. ఎం. మారుతి ప్రసాద్, లీడ్ ఆఫీసర్స్, అధికారులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here