అంతర్ జిల్లా నేరస్థులు అరెస్ట్ …

షేక్ అస్లాం నెల్లూరుతోపాటూ పలు జిల్లాలో చోరిలకు పాల్పడుతున్న అంతర్​ జిల్లా దొంగలను నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నెల్లూరు ఎస్పీ ఐశ్వర్య రస్తోగి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాకు చెందిన పెద్దినేని తిరుపతి స్వామి, చిత్తూరు జిల్లాకు చెందిన లక్ష్మీపతిలు ఓ ముఠాగా ఏర్పడి, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, గుంటూరు, నల్గొండ, ఖమ్మం, కర్నూలు, జిల్లాలో చోరిలు చేసేవారని అన్నారు. తిరుపతి స్వామి పాత నేరస్థుడని, ఇతనిపై 17 వారెంట్లు పెండింగ్​లో ఉన్నాయని, జల్సాలకు అలవాటు పడ్డ ఇతను చోరిలు చేయడమే వృత్తిగా పెట్టుకున్నారని తెలిపారు. తిరుపతిస్వామితోపాటూ లక్ష్మీ పతిని అదుపులోకి తీసుకుని విచారించగా, 18 హౌస్​ బ్రేకింగ్​లు, 3 కార్లు చోరిచేసినట్లు ఒప్పుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుంచి 50లక్షలు విలువచేసే ఒకటున్నర కేజీ బంగారు, మూడున్నర కేజీల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here