టీడీపీకి క్రమశిక్షణకు మారుపేరు – చంద్రబాబు.

THE BULLET NEWS (VIJAYAWADA)-విజయవాడ విజయానికి నాంది… ఇక్కడ నుంచి ఏ పని మొదలెట్టినా విజయం తథ్యమన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు… విజయవాడలోని కానూరులో జరుగుతోన్న మహానాడులో ఆయన ప్రారంభోపన్యాసం చూస్తూ… టీడీపీకి క్రమశిక్షణకు మారుపేరన్నారు. పార్టీకి ఏపీలో 60లక్షల మంది, తెలంగాణలో 10 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని… రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీని అభివృద్ధి చేసే శక్తి కేవలం టీడీపీకి మాత్రమే ఉందని… అందుకే ప్రజలు తమ పార్టీని గెలిపించారని వెల్లడించారు.

రాబోయే రోజుల్లో అన్నింటా విజయం మనదే అని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు… గతంలో ఎన్నడూ లేనంత స్పందన ఈ మహానాడుకు ఉందని… 70 లక్షల కార్యకర్తలు ఉన్న పార్టీ టీడీపీనే అని తెలిపారు. యువతకు ప్రోత్సహం ఇచ్చి బాగా చదువుకునేలా చేస్తున్నాం. ఐటీని అభివృద్ధి చేయడం ద్వారా విదేశాల్లో తెలుగువారు సత్తా చాటుతున్నారన్నారు. ఎంతోమంది కార్యకర్తల కష్టం, త్యాగాల ఫలితాలే ఏపీ అభివృద్ధికి చిహ్నమని పేర్కొన్న చంద్రబాబు… ఎన్టీఆర్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి కార్యకర్తలే కారణమని… కార్యకర్తలు లేకపోతే పార్టీయే లేదని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here