పేదల బాధలు మీకు పట్టవా..- జనసేన లీడర్ కేతంరెడ్డి

THE BULLET NEWS :

నిరుపేద‌ల గోడును, స‌మ‌స్య‌ల‌ను పాల‌కులు, అధికారులు పట్టించుకోవ‌డంలేద‌ని జ‌న‌సేన నాయ‌కులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి మండిప‌డ్డారు.. జ‌న‌సేన‌-జ‌న‌బాట‌లో భాగంగా న‌గ‌రంలోని వెంక‌టేశ్వ‌ర‌పురంలో 11వ‌రోజు ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా యువ‌త‌, మహిళ‌లు ఆయ‌న‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. ఇంటింటికి తిరుగుతూ క‌ర‌ప‌త్రాలు పంపిణీ చేస్తూ… పార్టీ విధివిధానాల‌ను కేతంరెడ్డి వివ‌రించారు. అనంత‌రం స్థానికంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌న ఆయ‌న అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ పేద‌ప్ర‌జ‌లంటే మంత్రి నారాయ‌ణ‌కు, మేయర్ అజీజ్‌కు, కార్పొరేష‌న్ అధికారుల‌కు చుల‌క‌న‌గా మారిపోయింద‌ని అన్నారు . భూగ‌ర్భ‌డ్రైనేజీ కోసం తవ్విన గుంత‌ల్లో ప‌డి తాము తీవ్ర గాయాల‌పాల‌వుతున్నామ‌ని, కుళాయిల ద్వారా వ‌స్తున్న నీరు దుర్వాస‌న వెద‌జ‌ల్లుతున్నాయ‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఇంకా రాత్రి వేళల్లో వీధి దీపాలు స‌రిగా లేక తాము ప‌డుతున్న అవ‌స్ధ‌లు వ‌ర్ణ‌ణాతీతంగా ఉన్నాయ‌ని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా కేతంరెడ్డి మాట్లాడుతూ న‌గ‌రంలో వెంక‌టేశ్వ‌ర‌పురానికి ప్ర‌త్యేక స్ధానం ఉంద‌న్నారు. పెన్నా బ్రిడ్జి దాటిన త‌ర్వాత ఈ ప్రాంతాన్ని పాల‌కులు ప‌ట్టించుకోవ‌డం మానేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌ధానంగా నీటికోసం ఇక్క‌డి వారు ప‌డుతున్న బాధ‌లు చెప్ప‌లేనివ‌ని, కుళాయిల్లో ఎప్పుడో వ‌చ్చే నీరు ద‌ర్గంధం వెద‌జల్లుతూ ఉంద‌న్నారు. భూగ‌ర్భ డ్రైనేజీ కోసం తవ్విన గుంత‌లు పూడ్చ‌క‌పోవ‌డంతో స్ధానికంగా ప‌లువురు గుంత‌ల్లో ప‌డి గాయాల‌పాల‌య్యార‌ని, చిన్నిపిల్ల‌ల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్నారు. పేరుకేమో గొప్ప‌లు చెప్పుకునే మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ‌, మేయ‌ర్ అజీజ్ లు ఈ కాల‌నీపై ఎందుకు ప్ర‌త్యేక దృష్టి పెట్ట‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో ఖ‌చ్చితంగా వెంక‌టేశ్వ‌రపురం స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న దృష్టికి తీసుకెళ్తామ‌ని, కుదిరితే ఆయ‌న‌ను కాల‌నీకి తీసుకువ‌చ్చి స్ధానికుల‌తో మాట్లాడించే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని హామీ ఇచ్చారు ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు కరంపూడి కృష్ణా రెడ్డి, కుక్క ప్రభాకర్, మహిళా నేత షేక్. ఆలియా, ఉడాలి సూర్య నారాయణ, కొలపల్లి దివాకర్, కకు మురళి రెడ్డి, అజిస్, మూలం మోషే, సన్నీ, త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here