బీరు బాటిళ్లతో వ్యక్తిపై దాడి :విద్యుత్ బిల్లు వివాదమే కారణం

విద్యుత్ బిల్ చెల్లింపు విషయంలో ఇద్దరు యువకులమధ్య నెలకొన్న వివాదంలో ఓ యువకుడిపై ఇద్దరు కలసి బీరు బాటిళ్లతో దాడి చేసి గాయపరచిన సంఘటన ఆదివారం రాత్రి నెల్లూరు నగరంలో 2వ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి ఔట్ పోస్ట్ పోలీసులు, బాధితుడి వివరాలమేరకు… స్థానిక ముకుందా పురంలోని ఓ అద్దె ఇంట్లో AC మెకానిక్ మేకల శ్రీనివాస్ యాదవ్, మరో యువకుడు అశోక్ లు కలసి ఉంటున్నారు. అద్దె, విద్యుత్ బిల్లు ఇద్దరూ సమానంగా చెల్లిస్తుంటారు. కోవిడ్ మొదలయినప్పటి నుంచి మేకల శ్రీనివాస్ యాదవ్ మాత్రమే ఇంటి అద్దె చెల్లిస్తున్నాడు. రెండు రోజుల క్రితం కరెంట్ బిల్లు చెల్లింపు విషయమై వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న అశోక్ అనే వ్యక్తి తన స్నేహితుడు సురేష్ తో కలసి ఆదివారం రాత్రి శ్రీనివాస్ పై గొడవకు దిగారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అశోక్, అతని స్నేహితుడు సురేష్ దాడి చేశారు. అంతలో సురేష్ పధకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న బీరు బాటిళ్లతో శ్రీను తలపై బలంగా కొట్టాడు.. దాంతో తీవ్ర రక్తస్రావం అయింది. దాంతో దాడి చేసినవారు అక్కడి నుంచి పరార్ అయ్యారు. శ్రీను ని స్థానిక యువకులు, స్నేహితులు కలసి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో కుట్లు వేశారు. ఆసుపత్రి ఔట్ పోస్ట్ పోలీసులు బాధితుడి నుంచి వివరాలు సేకరించి 2వ నగర పోలీస్ లకు సమాచారం ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here