వాలెంటీర్ పై దాడి

నెల్లూరు జిల్లా పొదలకూరు పంచాయితీ పరిధిలోని లింగంపల్లితోపు వద్ద బిట్ – 4 గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వాలెంటీర్ గిరిపై కొందరు వ్యక్తులు మంగళవారం దాడి చేశారు. అయితే దాడికి జరిగిన కారణాలు ఇలా ఉన్నాయి. అర్హులైన తమకు ఇళ్ల స్ధలాల విషయమై కాలనీవాసులు వాలెంటీర్ ని నిలదీశారు.ఆ వాలెంటీర్ నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం కాస్త చిలికి చిలికి గాలివానయైనట్లు ఇరువర్గాల మధ్య పరస్పర దాడులకు దారి తీసింది. అయితే ఆ విషయంపై వాలెంటీర్లు ఏకమై ఎంపిడిఓ కార్యాలయం వద్ద నుండి‌ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలి నిర్వహించి అనంతరం ఎస్ఐ కి ఫిర్యాదు చేశారు.తమకు న్యాయం చేయాలని కోరారు.ఈ దాడిపై ఎస్ఐ రహీం రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here