బారా షాహీద్ దర్గా టెండర్లు అవినీతి పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన జనసేన నాయకులు కెతం రెడ్డి వినోద్ రెడ్డి

నెల్లూరులోని ప్రతిష్టాత్మక బారా షహీద్ దర్గాలో ఇటీవల జరిగిన గంధమహోత్సవం మరియు రొట్టెల పండుగకు సంబంధించిన టెండర్లలో జరిగిన అవినీతి ,అవకతవకలు,వక్ఫ్ అధికారులు హైకోర్టు ఆదేశాల భేఖాతరు చేయడం, మితిమీరిన రాజకీయ జోక్యం, వంటి అంశాలపై దిన పత్రికలలో కథనాలు ప్రచురితం అయినాయి… మొదటగా 92.47 లక్షలకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ ను కాదని 70 లక్షలకు టెండర్ దాఖలు చేసిన వ్యక్తికి రాజకీయ జ్యోక్యంతో కాంట్రాక్టు కట్టబెట్టడం, వక్ఫ్బోర్డు అధికారులు గుత్తే దారులతో కుమ్మక్కు అవ్వడం లాంటి విషయాలను దిన పత్రికల ద్వారా తెలుసుకున్న ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది..ఎందుకంటే ఈ వ్యవహారం హైకోర్టు పరిధికి వెళ్లి దర్గాను కాంట్రాక్టర్ దగ్గర నుండి స్వాధీన పరుచుకోండి అని కోర్టు వక్ఫ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆర్డర్ అందలేదంటూ సదరు వ్యక్తులు తాత్సారం చేయడం,కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేయడమే అవుతుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈరోజుల్లో కోర్టు నోటీసు కానీ,ఆర్డర్ కాపీ కానీ,ఈమెయిల్, వాట్సప్ ద్వారా పంపినా,ఆ ఆదేశాలను అధికారులు పాటించాలని దేశంలోని న్యాయస్థానాలు అనేక సార్లు తెలియచేసాయి.కానీ ఇక్కడ బుధవారం కోర్టు ఆదేశిస్తే శుక్రవారం సాయంత్రం వరకు ఆ ఆదేశాలు మాకు అందలేదంటూ పట్టించుకోక పోవడం ఇక్కడ జరిగిన అక్రమాలను బహిర్గత పరుస్తున్నాయి.ఈ రకమైన నేరానికి పాల్పడిన సదరు అధికారులపై చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం. దర్గాలో హుండీ ఆదాయాన్ని మాయం చేయడం, దుకాణాల వారి వద్ద అద్దెల వసూళ్లు, గలేఫ్ దుస్తులు, ఆఖరికి ప్రసాదాలను కూడా స్వాహా చేయడం,ఈ మొత్తం అక్రమ వ్యవహారాలపై, తమరు క్షేత్ర స్థాయి దర్యాప్తు జరిపి అవినీతికి పాల్పడిన అధికారులు, పాలకులపై కఠిన చర్యలు తీసుకుని సామాన్య ప్రజల్లో ప్రభుత్వాలపై,ప్రభుత్వ టెండరింగ్ విధానాలపై విశ్వాసాన్ని పెంచవలసిందిగా జనసేన పార్టీ తరుపున సవినయంగా కోరుకుంటున్నాం.
అని జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు గారికి వినతి పత్రం అందచేశారు…వెంటనే స్పందించిన కలెక్టర్ గారు వక్ఫ్ బోర్డు సీఈఓ తో అక్కడి నుండే ఫోనులో మాట్లాడి,ఈ అక్రమాల వ్యవహారంపై వెంటనే సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు.అనంతరం ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులను విచారణకు ఆదేశించారు.
       

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here