నీకు ద‌మ్ముంటే నాపై పోటీ చేసి గెలువు- బొమ్మిరెడ్డిపై ఎమ్మెల్యే కురుగొండ్ల పైర్

The bullet news (VenkataGiri)- గాలిమాట‌లొద్దు.. నీకు దమ్ము, దైర్యం ఉంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నా పై పోటీ చేసి గెలువు.. అభివృద్దిని చూడ‌లేక మాపై విమ‌ర్శ‌లా..? అభివృద్ది పనుల్లో అవినీతి జ‌రిగింద‌ని నిరూపిస్తే రాజీనామా చేస్తా అంటూ వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ జ‌డ్పీ చైర్మ‌న్ బొమ్మిరెడ్డి పై పైర‌య్యారు.. ఇవాళ ఆయ‌న నివాసంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్ చార్జి బొమ్మిరెడ్డిపై మండిప‌డ్డారు.. ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు తాగునీటికి ఆల్లాడుతుంటే నీ తండ్రి ఎమ్మల్యే గా ఉన్న‌ప్పుడు ఏం చేశాడంటూ ప్ర‌శ్నించారు..తెలుగుదేశం ప్ర‌భుత్వం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వెంక‌ట‌గిరి అభివృద్ది ప‌థంలో దూసుకెళ్తుంటే అది ఓర్వ‌లేక విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బొమ్మిరెడ్డి త‌న‌పై పోటీ చేయాల‌న్నారు.. అప్పుడు ఎవ‌రు అవినీతిప‌రులో తెలుస్తుంద‌న్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here