రేపు ఉదయం 11 గంటలకు SVGS మైదానంలో “అమ్మఒడి” సభ

సీఎం నెల్లూరు పర్యటన పక్కా

కాన్ఫర్మ్ చేసిన CMO

రేపు ఉదయం 11 గంటలకు SVGS మైదానంలో “అమ్మఒడి” సభ

రాష్ట్ర ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి ఈ 11వ తేదీన నెల్లూరు పర్యటన యథాతథంగా ఉంటుందని CMO స్పష్టం చేసింది. ఆమేరకు జిల్లా అధికారులకు శనివారం రాత్రి జిల్లా ఉన్నతాధికారులు, ప్రోటోకాల్ అధికారులకు సంబంధిత ఆదేశాలు అందాయి. దాంతో ఇప్పటి వరకు ఉన్న ఉత్కంఠ కు తెరపడినట్లైంది.
జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డితోపాటు ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలసిల రఘురామ్, రూరల్ mla కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ,రూప్ కుమార్ యాదవ్ తదితరులు ముఖ్య నేతలు దగ్గరుండి svgs కళాశాల మైదానంలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు.

ఈ నేపధ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ ఇవ్వడం, కోడ్ అమల్లోకి తేవడంతో cm జిల్లా పర్యటనపై సందిగ్దత నెలకొంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం రేగుతోంది. ఈ క్రమంలో సీఎం ప్రోగ్రాం ఉంటుందా.. ఉండదా అనే అంశంపై అటు మీడియాలో, ఇటు జనాల్లో పెద్ద చర్చ జరుగుతోంది.

ఈ ఎన్నికల కోడ్ పట్టణాలు, నగరాలకు వర్తించదన్న నిబంధన ఉండటంతో ఇక జగన్ పర్యటన కు ఇబ్బంది ఉండదని కలెక్టర్ చక్రధర్ బాబు, మంత్రులు అంటున్నారు. ఇదే విషయాన్ని ఆదివారం మధ్యాహ్నం సభా మైదానంలో మంత్రులు ఆడిమలుపు సురేష్, అనిల్, గౌతమ్ లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పష్టం చేయనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు సీఎం పర్యటన ఉంటుందని, నెల్లూరు నుంచే అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారని మంత్రులు కాన్ఫర్మ్ చేస్తారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కూడా వారు మాట్లాడే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here