ఇష్టమొచ్చినట్లు జరిమానాలు వేస్తున్న కానిస్టేబుల్స్…వాహనదారులపై ‘e’ బాదుడు

టౌను పక్కకెళ్లొద్దురో.. డింగరి.. డాంబికాలు పోవద్దురా.. టౌను పక్కాకెల్లవో డౌన్ ఐపోతావు రబ్బీ బంగారు సామి” అన్నట్లుంది నెల్లూరు నగరంలో వాహనదారుల పరిస్థితి. ఏ వైపునకు వెళ్లినా… ఏ కూడలి మార్గంలో వెళ్లినా మన పోలీస్ అన్నలు నిలువునా తమ సెల్ ఫోన్లో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు బందించేస్తూ.. నిలువునా e- ఫైన్ లు వేసేస్తున్నారు.

అంతే 24 గంటల్లో మనకు RTO, పోలీస్ ఆన్ లైన్ నుంచి ఫైన్ వచ్చేస్తుంది. ఇంతకూ వాహనదారులు చేసిన పాపం ఏంటా అంటారా… మాస్క్ ధరించక పోవడం, త్రిబుల్ డ్రైవింగ్ చేయడం. ఇది ok.. తొందరపాటునో.. పొరపాటునో అలాంటివారు రోడ్డుపైకి వస్తే… పోలీసులు అలా ఫోటోలు తీసి ఇ-చలానా వేయడం సబబే… అది మన జాగ్రత్తకే.. ఇక్కడి వరకు బాగానే ఉన్నా… కొందరు AR కానిస్టేబుళ్లు.. అక్కడ SI లు లేకున్నా.. వారే తమ సెల్ ఫోన్లల్లో సాధారణ వాహనదారులు, మాస్క్ ధరించి ఉన్నా.. ఒక్కరు, ఇద్దరు మాత్రమే వెళ్తున్న ద్విచక్ర వాహనాలను బందిస్తూ.. వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దాంతో ద్విచక్ర వాహనదారులు, ఆటో వాలాలు నగరంలోకి రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. ఇదే పరిస్థితి నిత్యం స్థానిక బోసుబొమ్మ వద్ద ఓ AR కానిస్టేబుల్ ప్రవర్తిస్తున్న తీరుకు కొందరు గొడవలకు కూడా దిగుతున్నారు. అయినా అతని తీరులో మార్పు రావడంలేదు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here