నెల్లూరులో ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు సిపిఎం యత్నం..

నెల్లూరులో ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు సిపిఎం యత్నం …. భవన నిర్మాణ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సిపిఎం నెల్లూరు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు డై కాస్ రోడ్ లోని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు… మేకపాటి గౌతమ్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి తలుపులు వేసి ఉండటంతో నివాసం ముందే వారు ధర్నా నిర్వహించారు…. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిపిఎం నెల్లూరు రూరల్ నేత మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు.. ఈ కార్యక్రమంలో బత్తల కృష్ణయ్య, ఖలీల్ , అల్లాడి గోపాల్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here