జిల్లాస్థాయి సాండ్ కమిటీ సమావేశం…

నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలోని కలెక్టర్ ఛాంబర్ లో మంగళవారం.. కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధర్ బాబు జిల్లా అధికారులతో శాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇసుక రీచ్ ల గుర్తింపు, క్షేత్రస్థాయి పరిస్థితులపై అధికారులు కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెన్నా నదీ పరివాహక ప్రాంతంలో కొత్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో రెండు ఇసుక రీచ్ లు, కోవూరు మండలం పరిధిలో ఒక రీచ్ ను గుర్తించినట్లు అధికారులు కలెక్టర్ కి తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా ఇసుక రీచ్ లలో క్షేత్ర స్థాయిలో పర్యటించి తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డి.పి.ఓ ఎం. ధనలక్ష్మి, సెబ్ ఏఎస్పీ శ్రీధర్ మైనింగ్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here