ప్ర‌భుత్వానికి అవ్వ వేద‌న అర్దం అవ్వ‌దా..?

The bullet news (Podalakuru)- వృద్దాప్యంలో ఫించ‌న్ ఓ భ‌రోసా.. అనారోగ్యంతో మంచాన ప‌డ్డ‌ స‌మ‌యంలో పించ‌న్ ఆర్దిక ఆస‌రా.. అలాంటి ఆస‌రా క‌ల్పించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మవుతోంది.. అర్హులైన వృద్దుల‌కు పించ‌న్ ఇవ్వ‌కుండా కార్యాల‌యాల చుట్టూ తిప్పుకుంటుంది. కాళ్ల‌కు వేసుకున్న చెప్పులు అరుగుతున్నాయి త‌ప్ప‌.. పించ‌న్ మాత్రం రావ‌డం లేదు.. పించ‌న్ కోసం ఎదురుచూస్తు త‌న భ‌ర్త మృతిచెందాడు.. త‌న‌కైనా పించ‌న్ వ‌స్తుందో రాదో అంటూ ఓ అభాగ్య గిరిజ‌న వృద్దురాలు ఎదురుచూస్తుంది..

వివరాల్లోకి వెళితే… పొదలకూరు పట్టణంలోని శ్రామిక నగర్ లో పబ్బిశెట్టి చెంచమ్మ సుబ్బరామయ్య దంపతులు ఇళ్లల్లో పాచిపని చేసుకుంటూ జీవనం సాగించేవారు .వయసు మీద పడటంతో ఏ పని చేయలేక సుబ్బరామయ్య ఇంటికే పరిమితమయ్యాడు . పించ‌న్ వ‌స్తుంద‌ని ఎదురుచూసిన‌సుబ్బరామయ్య రెండు నెల‌ల క్రితం మృతి చెందాడు .ఏళ్ల తరబడి పింఛన్ కోసం ఎందరినో బతిమలాడిన ఆ గుండె ఆగిపోయింది .అంత్యక్రియలకు కూడా డబ్బు లేకపోవడంతో కాలనీ వాసులు తలా కొంత పోగుచేసి ఆ పని ముగించారు .ఈ పరిస్థితుల్లో భార్య చెంచమ్మ కదలలేని స్థితిలో కాలే కడుపు కోసం తప్పనిసరై ఊతకర్ర సాయంతో ఇంటింటికీ తిరిగి అడుక్కుని తింటో౦ది. ఏ మహానుభావుడైనా దయతలచి తాను బతికుండగా పింఛన్ ఇప్పిస్తాడేమోన ని ఆ అవ్వ ఆశగా ఎదురుచూస్తోంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here