ధన దాహంతో ఉన్న పార్టీలకు ఓటు వెయ్యొద్దు- తిరుపతి లోక్ సభ ఇండిపెండెంట్ అభ్యర్థి పిలుపు

దాన దాహంతో అధికారం కోసం అరులు చాస్తున్న పార్టీలకు ఓటు వెయ్యొద్దని తిరుపతి లోక్ సభ ఇండిపెండెంట్ అభ్యర్థి రాజ్ కుమార్ పిలుపునిచ్చారు..నెల్లూరు జిల్లా నాయుడుపేట లోని ALCM గ్రౌండ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్ని ధన దాహంతో ఉన్నాయని ప్రజల యోగక్షేమాలు వాటికి పట్టవు అన్నారు.. 70 సంవత్సరాలుగా తిరుపతి అభివృద్ధి ఏమి జరగలేదన్నారు. ఎన్నికల సమయంలో మాత్రం అనేక హామీలను ఇవ్వడం తప్ప ఆ హామీల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.. అందువల్లనే ప్రజలు మార్పు కోరుకోవాలని మార్పు దిశగా అడుగులు వేస్తున్నారని వివరించారు.. తనకు ఓటేసి తిరుపతి పార్లమెంటు లో తనని గెలిపించి పార్లమెంటుకు పంపాలని ప్రజల సమస్యల మీద పోరాడే హక్కు కల్పించాలని ఆయన కోరారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here