సీఎం పర్యటనపై వీడని ఉత్కంఠ

సీఎం పర్యటనపై వీడని ఉత్కంఠ ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు అనిల్, గౌతమ్, mla కోటంరెడ్డి

ఈ నెల 11న ముఖ్యమంత్రి జిల్లా పర్యటనపై సందిగ్ధం నెలకొని ఉంది. ఓ పక్క స్థానిక సంస్థలు ఎన్నికల కోడ్, మరోపక్క ఈడీ వాయిదాలు ఉండటంతో జగన్ మోహన్ రెడ్డి పర్యటన జరుగుతుందా .. లేదా అనేదానిపై స్పష్టత రావడంలేదు. అమ్మఒడి మాత్రం ఆగదని విద్యాశాఖ మంత్రి ఆదిమలుపు సురేష్ శనివారం ఓ క్లారిటీ అయితే ఇచ్చారు గాని.. cm జగన్ ఈ రెండో విడత కార్యక్రమాన్ని నెల్లూరు నుంచి ప్రారంభిస్తారా లేదా అనేదానిపై తాజాగా ఆ మంత్రి స్పష్టం చేయలేదు.

రాష్టంలో అనేక పరిణామాలు జరుగుతున్నా… మంత్రులు అనిల్, గౌతమ్ రెడ్డి, mla కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అధికారులు మాత్రం సీఎం సభా వేదికను శనివారం సాయంత్రం పరిశీలించారు. ఇప్పటి వరకు cm పర్యటన రద్దు పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. దాంతో ముందుగా ప్రకటించినట్లే 11వ తేదీన అమ్మఒడి కార్యక్రమం నెల్లూరులోనే ప్రారంభం అవుతోందని అందరూ భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో అనేక కుట్రలు జరుగుతున్నాయని అమ్మఒడి లబ్ధిదారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here